30 May 2010

మాది సినిమా పార్టీ”మురళీ మోహన్

ఈ మధ్యన రాజకీయాల్లో సినిమా వాళ్ల ప్రమేయం బాగానే ఉంటోంది. ఒక్కో హీరో ఒక్కో  పార్టీలో చురుకుగా పనిచేస్తున్నా, అదంతా కేవలం ఎన్నికల వరకే. వ్యక్తిగతంగా ఎవరెవరికి ఏమేమి వ్యాపకాలున్నా, ప్రధానంగా మేమంతా సినిమా వాళ్ళం. మాది సినిమా పార్టీ.  మేమెప్పటికీ  కలిసి ఉంటాం. కానీ ఈ సంగతి తెలియని అమాయకులెవరో సినిమా పరిశ్రమ ముక్కలైపోయింది, హీరో హీరోయిన్లంతా ఎవరికి వారే అన్నవదంతులని సృష్టించడంతో, అభిమానులు ఎందరో అయోమయానికి గురవుతున్నారు. మేమంతా కలిసెవున్నాము…ఉంటాము అని ఇటీవలే దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ‘స్పందన’ కార్యక్రమంలో రుజువు చేశాం.

ఇందుకు మరో తాజా ఉదాహరణగా మేము జూన్ 13 న మేము తలపెట్టిన క్రికెట్ మ్యాహుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున సినీ పరిశ్రమలోని దాదాపు అందరు నటీ నటులు ఎలాంటి భేషజాలకు పోకుండా, తమ స్థాయిలను పట్టించుకోకుండా కలిసి మెలిసి ఆడనున్నారు. అంతెందుకు… నిన్న సాయంత్రం జరిగిన “  ఝుమ్మంది నాదం”ఆడియో విడుదల  కార్యక్రమంలోకూడా బాలకృష్ణ, ,చిరంజీవి మోహన్‌బాబు ముగ్గురూ కలిసి పాల్గొన్నారు. ఒకరి బాగోగులు ఒకరు అడిగి మరీ తెలుసుకున్నారు. వారెవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నదానికి అదే నిదర్శనం. ఎన్నో సందర్భాల్లో నేను చెప్పినట్టుగానే ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను… మా సినిమా ఆర్టిస్టులంతా ఎప్పటికీ కలిసి మెలిసి ఉంటాం. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. దయచేసి లేని పోనీ అనుమానాలు పెట్టుకుని, అవసారినీకి మించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకండి అని ఈ సందర్భంగా పుకార్ల రాయుళ్లందరికి సవినయంగా నేను మనవి చేసుకుంటున్నాను.

One Response to “మాది సినిమా పార్టీ”మురళీ మోహన్”

  1. Subboo Says:

    Just now match between Nag and Chiru completed. It seems the pitch is not so good for play. Better stop the final so as to see our heroes are safe in this conditions. Please stop the next match if you can. Ground is dangerous now.