28 May 2010

పామరులను మెప్పించిన కవి వేటూరి:మురళీ మోహన్

తెలుగు పాట అంటే ఒకప్పుడు మనకు పింగళి, సీనియర్ సముద్రాల, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరధి, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీ శ్రీ లాంటి వారు గుర్తొచ్చేవారు. వేటూరి గారు సినిమాల్లోకి ప్రవేశించాక, దశాబ్దాల పాటు వేరే రచయిత పేరు పెద్దగా వినిపించేది కాదు. అంతగా సినీ పరిశ్రమను ఆయన శాసించారు. వేటూరి గారి కాలానికి రెండు వైపులా పాళీలే అన్నది అందరికి తెలిసిన విషయమే. సందర్భం ఏదైనా, పాట ఎలాంటిదైనా  అవలీలగా, ఆశువుగా రాయగల రచయిత ఆయన.
ముఖ్యంగా వేటూరి గారి కలం విశ్వనాధ్ గారి సినిమాల్లో కదం తొక్కింది అని చెప్పుకోవాలి. అలాగే వేటూరి గారు మా జయభేరి సంస్థ నిర్మించిన చాలా చిత్రాల్లో అద్భుతమైన సాహిత్యంతో మా చిత్రాల స్థాయిని పెంచారు. ముఖ్యంగా మేము నిర్మించిన “రాజేశ్వరీ కళ్యాణం” చిత్రంలో ఆయన రాసిన “ఓడను నడిపే…” అనే పాటకు నంది అవార్డు రావడం మాకెంతో గర్వకారణం. ఆయన లేని లోటు పూడ్చలేనిది” అన్నారు.

Comments are closed.